Friday, August 17, 2007

ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?

రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం...

రాజీవ్ గృహకల్ప...
రాజీవ్ ఆరోగ్యశ్రీ...
రాజీవ్ రహదారి... రాజీవ్ యువశక్తి...రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్...కడపలో ఇంకేదో రాజీవ్ సంస్థ...
హైదరాబాదు కె.పి.హెచ్.బి.కాలనీకి రాజీవ్ గాంధి కాలనీగా పేరుమార్పు...
విశాకా స్టేడియమ్ కి రాజీవ్ స్టేడియంగా పేరుమార్పు...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహప్రతిష్ఠాపనలు...
రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్......
ఒకటే శారిడాన్...ఇక ఉండదు తలనొప్పి...

ఎవరీ రాజీవ్ ? మనమంతా ఇంతగా ఆయన్ని తల్చుకు తీఱాలని మన రాష్ట్రప్రభుత్వం మనల్ని శాసించడానికి-ఏం చేశాడాయన ఆంధ్రప్రదేశ్‌కి ? ఇంతగా ఎనిమిదిన్నర కోట్ల మందిమి ఆయనకి తరతరాలుగా ఋణపడిపోవడానికి ఏమిటాయనగారి వితరణ (contribution) ? ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం చూపించాడు ? మన రాష్ట్రంలో ఏ ప్రత్యేకరంగాన్ని ఆయన అభివృద్ధి చేశాడు ? ఆయనగారి స్వరాష్ట్రంలో సైతం ఆయనకు పట్టని బ్రహ్మరథాలు ఇక్కడెందుకు పట్టుతున్నారు చెప్మా ? అదే సమయంలో ఇక్కడి మహానాయకులెందుకు చరిత్ర చెత్తబుట్టలోకి విసిరెయ్యబడుతున్నారు ? అసలు ఏమౌతాడాయన తెలుగువాళ్ళకు ? పొఱపాటున మనమాయన్ని మర్చిపోతే కొంపలేం మునుగుతాయి ? మనమాయన్ని మర్చిపోకూడదని ఈ ప్రభుత్వానికెందుకింత పట్టుదల ?

ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు.కారణం తెలీదు.తెలుగువారిలో రాజకీయాలకు అతీతులైన కవులు లేరా ? కళాకారులు లేరా ? సంఘసేవకులూ, సంఘసంస్కర్తలూ, త్యాగధనులూ, శాస్త్రవేత్తలూ లేరా ? అందరమూ ఇలా బతికున్న అమ్మగారి, చచ్చిపోయిన అమ్మమొగుడుగారి మఱియు అత్తగారి సేవలో తరించిపోవడానికి హేతువేమిటి ? ప్రతినెలా ఢిల్లీకి తెలుగువాళ్ళ డబ్బుతో సూట్‌కేసులు మోస్తే మోశారు, కనీసం సాంస్కృతిక స్థాయిలో నైనా తెలుగుదనాన్ని గుబాళించనివ్వరా ? దేవుడా ! రక్షించు నా రాష్ట్రాన్ని !

4 comments:

మన్యవ said...

హాయ్.. మీ బ్లాగు బాగుంది...
కూడలి, తేనెగూడు, జల్లెడ, తెలుగుబ్లాగర్స్.కామ్ లలో చేర్చండి..అందరూ చూస్తారు.
http://koodali.org
http://thenegoodu.com
http://telugubloggers.com

One Stop resource for Bahki said...

కేక మామా ..బలే చెప్పావు ....వర్దిల్లూ....

Anonymous said...

konchemee lanke chooDanDi.

-- vihaari

కందర్ప కృష్ణ మోహన్ - said...

కెవ్వు కేక మామా...నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని............