Wednesday, August 29, 2007

ఒక చిన్న కవిత మీకొసం సుమా!!!

ఎన్నాళ్ళిలా
ఏడుపులు.. ఓదార్పులు
తప్పుకో ఇక ఆడలేనని

జీవన క్రీడ

ఒప్పుకో ఇక సాగలేనని
ఈ ముళ్ళ బాట

అవ్వ బువ్వ తినలేదని
తాత దగ్గు వినలేనని
చూడలేని అమ్మ కళ్ళూ
నడవలేని నాన్న కాళ్ళూ
ఎన్నాళ్ళీ రోదన రాగం?
ఎన్నాళ్ళీ వేదన రోగం?

గంపెడంత బావ ఆశ
తీర్చలేని అక్క గోస
సమాజాల దుర్భిణిలో
సగటోడా ఎన్నాళ్ళు

ఛీ! ఛీ!

వెళ్ళిపో దూరంగా
సన్యాసం లోకి
సాధువులా ముసుగేసుకో
పిరికిపంద!!

హైదరాబాద్ సొధరులుకి ఇధీ నా పెలుపు

Saturday, August 18, 2007

యమ యమ అని అంటున్నారు

ఒకడు : మమ ఎన్ టి ఆర్ స్టెప్స్ ఇరగధిసాడూ మమ...అబ్బొ కెక అంతే
ఇంకొకడు : ఇంటెర్వెల్ సీన్ ముందు ఎన్ టి ర్ మరియు మొహన్ బాబు మధ్య సంభషన కేక మమ

వేరెఒంకొకడు : మమ ఎం స్ నారాయణ ఒక స్చెనె లూ "భుట్టాలొ చెయ్యీ పెట్టి ఈగలు తొలినట్టు సంబషన ప్రేక్షాకులుని కవ్వింతలు కేరింతలు పెట్టించింధి మామా

Friday, August 17, 2007

తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి

తెలుగువాడి పన్నులతో సమకూరిన నిధులతో కట్టిన ప్రోజెక్టులకి కాలనీలకీ ,
తెలుగువాడైన అంజయ్యని కించపరచిన రాజీవు ఇందిరల పేర్లా?(ఇప్పటికీ ప్రజలకి రాజీవ్ అంటే "భొఫోర్స్" అనీ ఇందిర అంటే "ఎమర్జెన్సీ" అనీ గుర్తుకొస్తుంది )....
...నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు చందంగా ఉన్న మీ పాలన సగటు తెలుగుపౌరుడి కి వెగటు పుట్టిస్తుంది.
ఎందరో త్యాగధనులున్న తెలుగు నేల మనది....... జీవిత కాలం రాజకీయవిలువలతో బ్రతికి అవినీతి కార్యక్రమాలకి దూరం గా
నిరంతరం ప్రజల మనుషులు గా మన్నలను పొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచి
తనువు చాలించిన తెలుగు రాజకీయ రత్నాలు మనకెన్నో ఉన్నాయి....
ఒక పింగళి వెంకయ్య (ఎర్రకోటపై గర్వం గా ఎగిరే త్రివర్ణ పతాక రూపకర్త....మరి ఈయన ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడు)ఒక రావి నారాయణ రావు ( తెలంగాణా పోరు బిడ్డ) .........ఒక సురవరం ప్రతాపరెడ్డి .....రాణీ రుద్రమ......
త్రిపురనేని రామస్వామి చౌధరి..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.........అల్లూరి......పుచ్చలపల్లి.....టంగుటూరి...కందుకూరి......
ఇలా ఈ చిట్టా పెరిగిపొతూంది....
వీళ్ళెవరూ పనికి రాక పోవటానికి కారణం అందరికీ తేటతెల్లమే....తమ కుర్చీ కాపాడుకోవటనికి
తెలుగుప్రజల తో ముడిపడి ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు....
ఇంత జరుగుతున్నా ఇంకా నిద్రపోదామా? నిర్వీర్యంగా చూస్తూ ఉడ్దిపోదామా?.ఇంకానా ఇక సాగదు ..ఉద్యమించండి...

పోరాడండి....పోరాడితే పోయేది ఏమీలేదు....కళంకుల పేర్లు తప్ప.

ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?

రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం...

రాజీవ్ గృహకల్ప...
రాజీవ్ ఆరోగ్యశ్రీ...
రాజీవ్ రహదారి... రాజీవ్ యువశక్తి...రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్...కడపలో ఇంకేదో రాజీవ్ సంస్థ...
హైదరాబాదు కె.పి.హెచ్.బి.కాలనీకి రాజీవ్ గాంధి కాలనీగా పేరుమార్పు...
విశాకా స్టేడియమ్ కి రాజీవ్ స్టేడియంగా పేరుమార్పు...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహప్రతిష్ఠాపనలు...
రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్......
ఒకటే శారిడాన్...ఇక ఉండదు తలనొప్పి...

ఎవరీ రాజీవ్ ? మనమంతా ఇంతగా ఆయన్ని తల్చుకు తీఱాలని మన రాష్ట్రప్రభుత్వం మనల్ని శాసించడానికి-ఏం చేశాడాయన ఆంధ్రప్రదేశ్‌కి ? ఇంతగా ఎనిమిదిన్నర కోట్ల మందిమి ఆయనకి తరతరాలుగా ఋణపడిపోవడానికి ఏమిటాయనగారి వితరణ (contribution) ? ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం చూపించాడు ? మన రాష్ట్రంలో ఏ ప్రత్యేకరంగాన్ని ఆయన అభివృద్ధి చేశాడు ? ఆయనగారి స్వరాష్ట్రంలో సైతం ఆయనకు పట్టని బ్రహ్మరథాలు ఇక్కడెందుకు పట్టుతున్నారు చెప్మా ? అదే సమయంలో ఇక్కడి మహానాయకులెందుకు చరిత్ర చెత్తబుట్టలోకి విసిరెయ్యబడుతున్నారు ? అసలు ఏమౌతాడాయన తెలుగువాళ్ళకు ? పొఱపాటున మనమాయన్ని మర్చిపోతే కొంపలేం మునుగుతాయి ? మనమాయన్ని మర్చిపోకూడదని ఈ ప్రభుత్వానికెందుకింత పట్టుదల ?

ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు.కారణం తెలీదు.తెలుగువారిలో రాజకీయాలకు అతీతులైన కవులు లేరా ? కళాకారులు లేరా ? సంఘసేవకులూ, సంఘసంస్కర్తలూ, త్యాగధనులూ, శాస్త్రవేత్తలూ లేరా ? అందరమూ ఇలా బతికున్న అమ్మగారి, చచ్చిపోయిన అమ్మమొగుడుగారి మఱియు అత్తగారి సేవలో తరించిపోవడానికి హేతువేమిటి ? ప్రతినెలా ఢిల్లీకి తెలుగువాళ్ళ డబ్బుతో సూట్‌కేసులు మోస్తే మోశారు, కనీసం సాంస్కృతిక స్థాయిలో నైనా తెలుగుదనాన్ని గుబాళించనివ్వరా ? దేవుడా ! రక్షించు నా రాష్ట్రాన్ని !

ఈనాడు - ఈ పేపర్

హాయ్...

ఈనాడు ఈ పేపర్ ని ప్రవేశ పెట్టింది..ఇన్ని రోజులు కేవలం వార్తల సూచికలనే వెబ్ లొ (
http://www.eenadu.net/ ) ఉంచిన ఈనాడు .. ఇప్పుడు కొత్తగా మొత్తం పేపర్ ని స్కాన్ చెసి చక్కగా కొత్త సైట్ (http://epaper.eenadu.net/) ఉంచింది.. దీని వల్ల అచ్చం పేపర్ ని చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది..అంతే కాకుండా ఫొటొస్ ని, వార్తల ని క్లిప్ చేసుకుని దాచుకొవచ్చు ...

Thursday, August 16, 2007

ఇక "నెహ్రూగిరి" తో "సంజయ్ దత్" ..అఛ్ఛా ఖైదీ...56 ( AK 56 )



సంజయ్ దత్ జైల్లో నెహ్రూ గారి లాగా....పుస్తకాలు... డైరీ..లు రాయటం మొదలెట్టాడు...ఈ "నెహ్రూగిరి" మొదలెట్టి రాసిన డైరీ లో ఒక పేజీ....ఇదిగో...

* * * * * * * *

"చట్టం తన పని తాను చేసుకు పొతుంది...చేసుకుపొయింది కూడా..."

చీకటి ప్రపంచం తో స్నేహం ఈ చీకటి గదికి నన్ను చేర్చింది... ఒక AK56 ..నలభై యెనిమిదేల్లకి నాలో తూటాలు దించింది...కౌరవుల పాపం పండటానికి 14 యేల్లు పడుతుందని మహాభారతం లో పాండవుల అరణ్యవాసం నిరూపించినట్లు... నా పాపం ఇదిగొ ఇలా 14 యేల్ల తరువాత ఇప్పుడు పండింది...

మార్చి 12(1930).....ఆ మహాత్ముడు..నా బాపూ...ఉప్పు సత్యాగ్రహం కోసం "దండి" యాత్ర చేస్తే ...అదే మార్చి 12(1993)న కొందరు భారత మాత ఉప్పు తిని ...ఆమెపైకి ముంబాయి పేలుళ్ళ ద్వార దండ యాత్ర చేసారు...

సహాయ నిరాకరణ ఉద్యమం తో..బ్రిటీషు పాలకులను మూడు చెరువుల నీల్లు తాగించిన మహాత్మా గాంధీ కి 1922 లో..ఇదే జైల్లో...ఇదే ..6 యేళ్ళ శిక్ష విధించారట..నేను..ఈ పవిత్ర భారత దేశానికి నా సత్ప్రవర్తన చూపించి ఈ ఆరేల్ల శిక్ష "సాధించ" గలిగా...హ ..నాకూ బాపూ కి పొలికా...? ఇంకా నా మీద జనాల్లో ఉన్న అభిమానం కాకపోతేనూ... కానీ... ఎక్కడొ ఆశ...మరి నన్ను కూడా....శిక్షాకాలం ముగియకుండానే ..గాంధీ లాగా.. రెండేళ్ళకే వదిలేస్తారా...ప్చ్..ఏమో....భగవంతుడా...

దక్షిణ ఆఫ్రికా లొ ...జైల్లో ఉన్నప్పుడు గాంధీ తమిళం నేర్చుకున్నారట ..పుస్తకాలు చదివే మంచి అవకాశంగా దాన్ని ఆయన భావించారట...
**నేను కూడా..తమిళమో..తెలుగో...నేర్చుకుంటా...బయటకి వచ్చాక...నా సినిమాలు నేనే రీ మేక్ చేసుకుంటా అన్ని భాషల్లో.... :) హ...

చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఇంక ఎంతో చెయ్యాల్సి ఉంది....!!! ఇక్కడ ఒక కొత్త జీవితం మొదలెడ్తా......

** మరిన్ని పుస్తకాలు చదువుతా..... నాలా ఎవ్వరూ తప్పు చెయ్యకుండా నా అనుభవాలను... జీవన పాఠాలను...పుస్తకాలు గా రాస్తా....

** నా అల్లరితో జైలర్ లింగం మావల బడతం పడతా ..

** కరడు గత్తిన తీవ్రవాదులకి .."జాదూ కి..ఝప్పీ .." రుచి చూపిస్తా....యావజ్జీవ కారాగారులకి,ఉరి శిక్ష పడిన వారు...ప్రతి నిమిషమూ ఆనందించేట్లు చేస్తా.......

****....అఛ్ఛా ఖైదీ 56 (AK 56) అనిపించుకుంటా....!!

పాథ రెడీయో పధివెల







యమదొంగ స్పందన