Friday, August 17, 2007

తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి

తెలుగువాడి పన్నులతో సమకూరిన నిధులతో కట్టిన ప్రోజెక్టులకి కాలనీలకీ ,
తెలుగువాడైన అంజయ్యని కించపరచిన రాజీవు ఇందిరల పేర్లా?(ఇప్పటికీ ప్రజలకి రాజీవ్ అంటే "భొఫోర్స్" అనీ ఇందిర అంటే "ఎమర్జెన్సీ" అనీ గుర్తుకొస్తుంది )....
...నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు చందంగా ఉన్న మీ పాలన సగటు తెలుగుపౌరుడి కి వెగటు పుట్టిస్తుంది.
ఎందరో త్యాగధనులున్న తెలుగు నేల మనది....... జీవిత కాలం రాజకీయవిలువలతో బ్రతికి అవినీతి కార్యక్రమాలకి దూరం గా
నిరంతరం ప్రజల మనుషులు గా మన్నలను పొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచి
తనువు చాలించిన తెలుగు రాజకీయ రత్నాలు మనకెన్నో ఉన్నాయి....
ఒక పింగళి వెంకయ్య (ఎర్రకోటపై గర్వం గా ఎగిరే త్రివర్ణ పతాక రూపకర్త....మరి ఈయన ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడు)ఒక రావి నారాయణ రావు ( తెలంగాణా పోరు బిడ్డ) .........ఒక సురవరం ప్రతాపరెడ్డి .....రాణీ రుద్రమ......
త్రిపురనేని రామస్వామి చౌధరి..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.........అల్లూరి......పుచ్చలపల్లి.....టంగుటూరి...కందుకూరి......
ఇలా ఈ చిట్టా పెరిగిపొతూంది....
వీళ్ళెవరూ పనికి రాక పోవటానికి కారణం అందరికీ తేటతెల్లమే....తమ కుర్చీ కాపాడుకోవటనికి
తెలుగుప్రజల తో ముడిపడి ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు....
ఇంత జరుగుతున్నా ఇంకా నిద్రపోదామా? నిర్వీర్యంగా చూస్తూ ఉడ్దిపోదామా?.ఇంకానా ఇక సాగదు ..ఉద్యమించండి...

పోరాడండి....పోరాడితే పోయేది ఏమీలేదు....కళంకుల పేర్లు తప్ప.

1 comment:

రాధిక said...

రాజీవశేఖరుడి స్వామిభక్తిని మెచ్చుకోకుండా ఇన్నేసి మాటలంటారా?నేనొప్పుకోను.రేపు మీ పిల్లలకీ ఆ పేరు పెట్టకపోతే రేషన్లు,లోన్లు ఇవ్వమన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు.